- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : రేపు ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఈడీ విచారణకు కేటీఆర్
ఫార్ములా ఈ కారు రేసు(Formula E Car Race Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రేపు గురువారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ కారు రేసు(Formula E Car Race Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రేపు గురువారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా ఈ కారు రేసు అక్రమాల కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్..రేపు ఈడీ(ED) విచారణకు కూడా హాజరుకానుండటం ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్(FIR) ఆధారంగానే ఈడీ విచారణ చేపట్టనుంది. కేటీఆర్ ఒత్తిడితోనే నిబంధనలు పాటించకుండా రూ.55 కోట్ల బదిలీ చేశారని, మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలతో కేసు నమోదైంది.
కేసులో A1గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను చేర్చారు. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. వారిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారించనున్నరు. మరోవైపు ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టులు కూడా కొట్టివేయడం కేటీఆర్ కు ఎదురుదెబ్బగా మారింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు విషయంలో ఏసీబీ, ఈడీలు ఈ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం వినిపిస్తోంది.






