- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్..! ఎక్కడికి రావాలో టైం, డేట్ చెప్పు: బండి సంజయ్ సంచలన సవాల్
తెలంగాణలో విచిత్ర రాజకీయం నడుస్తోందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో విచిత్ర రాజకీయం నడుస్తోందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాఖీ పౌర్ణమి (Rakhi Pournami) సందర్భంగా ఇవాళ ఆయన రాష్ట్రంలో అక్కా, చెల్లెళ్లలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో చిత్రవిచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయని.. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అన్నట్లుగా కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ పొలిటికల్ దోస్తీ కొనసాగుతోందని ఆరోపించారు. వాళ్ల అవినీతికి వీళ్లు.. వీళ్ల అవినీతి వాళ్లు పరస్పరం సహకారం చేసుకుంటూ.. రాష్ట్రాన్ని నట్టేట ముంచుతున్నారని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌లు, ఎంక్వైరీలు తప్ప కేసులో ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయలేదని అన్నారు. నిందితుడు రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్‌లో కేసీఆర్ (KCR) పేరు ఉందన్నారు. ఒకవేళ కేటీఆర్ తనకు ఇచ్చే నోటీసులకు ఏం సమాధానం ఇవ్వాలో తనకు తెలుసని అన్నారు. అదే తాము నోటీసులు ఇవ్వాలనుకుంటే చాలా ఉన్నాయని బండి సంజయ్ ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చారు.
మేం మావోయిస్టు సింపతైజర్లమట...
కేటీఆరే తన ఫోన్ ట్యాపింగ్ చేయించాడని తనకు తెలుసని బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై తడి బట్టలతో తాను ప్రమాణానికి సిద్ధమని బండి సంజయ్ అన్నారు. కావాలంటే తన ఫ్యామలీ మొత్తాన్ని తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తానని అన్నారు. ఏ గుడికి రమ్మంటారో కేటీఆరే.. డేట్, టైమ్ చెప్పాలని బండి సంజయ్, కేటీఆర్‌కు సంచలన సవాల్ విసిరారు. తన సవాలుపై కేటీఆర్ స్పందించాలని అన్నారు. సొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని తెలిపారు. మావోయిస్టు సింపతైజర్లుగా మా పర్లు పోలీసులకు పంపడం దారుణమని అన్నారు. ఆ జాబితాలో తన పేరుతో సహా రేవంత్ రెడ్డి పేరు కూడా ఉందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు సిగ్గుంటే ఇప్పటికైనా ఆ పార్టీ నుంచి బయటకు రావాలని బండి సంజయ్ కామెంట్ చేశారు.
కేసీఆర్‌కు రూ.వేల కోట్లు ఎక్కడివి..
హైకోర్టు జడ్జిలు, భార్యాభర్తలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు కేసీఆర్‌కు రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. గతంలో ఢిల్లీ, బెంగాల్ ప్రభుత్వాలకు డబ్బులు పంపలేదా అని ఫైర్ అయ్యారు. చివరికి మహారాష్ట్ర ఎన్నికలకు కూడా కేసీఆర్ డబ్బులు పంపారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ఇప్పటికే వరకు కేసీఆర్, కేటీఆర్‌ను ఎందుకు పిలవడం లేదని సిట్‌ను ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసలో రాష్ట్ర ప్రభుత్వ విచారణపై తమకు నమ్మకం లేదని, సీబీఐతో విచారణ జరిపిస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయని బండి సంజయ్ అన్నారు.






