- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాగంటి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్
by Ajay Maddhiboyina |
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్‌లో వాకబు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్‌లో వాకబు చేశారు. వారి కుటుంబానికి అండగా ఉండేందుకు తన అమెరికా పర్యటన కుదించుకుని ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. కేటీఆర్ గోపీనాథ్ కుటుంబ సభ్యులకు, డాక్టర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఏఐజీ వైద్యులను కేటీఆర్ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని వైద్యులు కేటీఆర్‌కు వివరించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాగంటి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Next Story






