- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : మీ వల్లే సభ సక్సెస్ : ఆ నేతలకు కేటీఆర్ స్పెషల్ థాంక్స్
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ(BRS Silver Jubli Meeting) విజయవంతంగా నిర్వహించినందుకు వరంగల్ జిల్లా(Warangal District) పార్టీ బృందానికి నేడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అభినందనలు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ(BRS Silver Jubli Meeting) విజయవంతంగా నిర్వహించినందుకు వరంగల్ జిల్లా(Warangal District) పార్టీ బృందానికి నేడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అభినందనలు తెలిపారు. సభను విజయవంతం చేయడంలో నిరంతరం శ్రమించిన పార్టీ నాయకులకు, ముఖ్యంగా గత నెల రోజులుగా ఎండను సైతం లెక్క చేయకుండా 6 జిల్లాల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లలో నిమగ్నమై విశేషంగా కృషి చేసిన నాయకులను ప్రశంసించారు. మీ వల్లే సభ అంత పెద్ద సక్సెస్ అయిందని కొనియాడారు.
అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ అవకాశం ఉమ్మడి వరంగల్ జిల్లాకు కల్పించినందుకు గాను ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర రమణారెడ్డి, కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి తదితర నాయకులు కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.






