దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇంకెప్పుడు?

by velandi.Saikiran |

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అవుతున్నా దివ్యాంగుల పెన్షన్లు పెంచడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇంకెప్పుడు?
X

రెండేండ్లు అవుతున్నా పెరగని పెన్షన్లు

- దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఇంకెప్పుడు?

- దివ్యాంగుల హక్కుల కోసం బీఆర్ఎస్ నినదిస్తుంది

- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అవుతున్నా దివ్యాంగుల పెన్షన్లు పెంచడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో ఆరోపించారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించేందుకు ప్రతినబూనుదామని పిలుపునిచ్చారు. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా వారి అభ్యున్నతి కోసం అనేక పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. కేసీఆర్ దివ్యాంగులకు అత్యధికంగా రూ.4,016 పెన్షన్ ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఒక ఆసరా పెన్షన్ ద్వారానే దాదాపు రూ.10 వేల కోట్లు అందించామని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలలో 3 శాతం నుండి 4 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకున్నామని.. దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా అనేకమందికి సహాయ ఉపకరణాలు ఉచితంగా అందించామని తెలిపారు. కానీ.. అధికారం కోసం దివ్యాంగులకు రూ.6 వేల పింఛను, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ లాంటివి ఆశ చూపి రెండేళ్లు అవుతున్నా దానిని అమలు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ దివ్యాంగుల హక్కుల కోసం నిరంతరం నినదిస్తుందని, సమస్యల పరిష్కారానికి వారి వెంట నడుస్తుందని భరోసా ఇచ్చారు.

Next Story