- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: ఇచ్చిన వాగ్దానాలను ప్రశ్నించకూడదా.. మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్
ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సమాజిక న్యాయ సమరభేరి సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ జేఏసీ ‘చలో సెక్రటేరియట్’ పిలుపునిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సమాజిక న్యాయ సమరభేరి సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ జేఏసీ ‘చలో సెక్రటేరియట్’ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) పరిధిలోని విద్యార్థులతో పార్టీ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. గౌరవనీయులైన మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) గారు.. మీరు హైదరాబాద్‌లో ‘సంవిధాన్’ను సంబరంగా జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ప్రభుత్వం విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేయించిందని వీడియోలను ట్యాగ్ చేశారు.
ఈ చర్య కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య హక్కుల పట్ల నిర్లక్ష్యానికి స్పష్టమైన రుజువు అని ఎద్దేవా చేశారు. పోలీసులు క్యాంపస్‌లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు? విద్యార్థులను లాక్కెళ్లడానికి వారికి అధికారం ఎవరిచ్చారని మండిపడ్డారు. నిరసన వ్యక్తం చేసే ప్రాథమిక హక్కును ‘సంవిధాన్’ నుంచి తొలగించారా..? అని సెటైర్లు వేశారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటిందని అన్నారు. ఒకవేళ విశ్వవిద్యాలయంలో నిరసనలు జరగకపోతే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇచ్చిన వాగ్దానాలను ప్రశ్నించకూడదా రాహుల్ గాంధీ (Rahul Gandhi) గారు.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.






