కేటీఆర్ కనీసం సిగ్గైనా ఉండాలి కదా.. విప్ ఆది శ్రీనివాస్ సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-17 06:55:03  IST  )

ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసును లొట్టపీసు కేసు అని కామెంట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR).. తప్పు చేయనప్పుడు అరెస్ట్‌కు ఎందుకు భయపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ కనీసం సిగ్గైనా ఉండాలి కదా.. విప్ ఆది శ్రీనివాస్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసును లొట్టపీసు కేసు అని కామెంట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR).. తప్పు చేయనప్పుడు అరెస్ట్‌కు ఎందుకు భయపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన దిమ్మతిరిగే తీర్పుతో ఈ మధ్య కల్వకుంట్ల కుటుంబం కేవలం ఫామ్‌హౌస్‌కే పరిమితమైందని.. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు సైతం వరుస కేసులతో ప్రజా సేవను గాలికొదిలేశారంటూ ఫైర్ అయ్యారు. ఫార్ములా ఈ-రేసు కేసును లొట్టపీసు కేసు అన్న కేటీఆర్‌పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. లోపల భయంతో వణికిపోతున్నాడని తెలిపారు. సోమవారం ఏసీబీ (ACB) విచారణ హాజరై బయటకు వచ్చిన వెంటనే.. కేటీఆర్‌కు బీఆర్ఎస్ (BRS) వర్గాలు బాణాసంచా కాల్చి స్వాగతం పలకడం ఏంటని ప్రశ్నించారు. అరెస్ట్ చేయనందుకు సంబురాలు చేసుకుంటున్నారా అని దుమ్ము దులిపారు. తప్పు చేసినోళ్లకు రాచమర్యాదలట.. బావ, బావమరుదుల ఆలింగనాలట అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రతిష్టను నాశనం చేసి గొప్పలు చెప్పుకుంటున్న కేటీఆర్‌కు సిగ్గుండాలని ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.


Also Read..

నగరవాసులకు తీపికబురు.. మెట్రో సెకండ్ ఫేజ్‌కు గ్రీన్ సిగ్నల్

ఇందిరా మహిళా శక్తి చీరలతో నేతన్నలకు చేతినిండా పని : వేములవాడ ఎమ్మెల్యే

Next Story