- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరా మహిళా శక్తి చీరలతో నేతన్నలకు చేతినిండా పని : వేములవాడ ఎమ్మెల్యే
ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లతో సిరిసిల్ల నేత

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లతో సిరిసిల్ల నేత కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. గడువులోగా మొదటి చీరను అందించి, రెండవ చీర తయారీకి సన్నద్ధం కావాలని ఆయన మరమగ్గాల కార్మికులకు సూచించారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని గణేష్ నగర్ లో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియను రాష్ట్ర చేనేత జౌళి, దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రోజుకు ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారో, వారానికి ఎంత ఆదాయం వస్తుందో కార్మికులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వస్త్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు కార్మికులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అందులో భాగంగానే ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లను ప్రభుత్వం అందించిందని, కార్మికులు, ఆసాములు చెప్పిన విధంగానే ధరను నిర్ణయించామన్నారు. ఈ ఆర్డర్లతో కార్మికులకు ఎనిమిది నెలలపాటు ఉపాధి దొరుకుతుందని, నేత కార్మికులకు వారానికి నాలుగు నుంచి ఐదు వేలు సంపాదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దశాబ్దాల కల నెరవేరుస్తూ ప్రభుత్వం వేములవాడలో తొంబై శాతం సబ్సిడీ అందిస్తూ 50 కోట్లతో నూలు డిపో ను ఏర్పాటు చేసిందని, గత ప్రభుత్వ బకాయిలు కూడా చెల్లించిందని గుర్తు చేశారు.
సెస్ పరిధిలోని బ్యాక్ బిల్డింగ్ బకాయిల సమస్య కోర్టు పరిధిలో ఉందని, త్వరలో ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి నిర్ణయం తీసుకుంటామని భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లను సద్వినియోగం చేసుకుని, కార్మికులు, ఆసాములు మరింత అభివృద్ధి లోకి రావాలని వారు ఆకాంక్షించారు. అనంతరం మరమగ్గాల కార్మికులు, ఆసాములు, యజమానులు, కార్మిక సంఘ నాయకులతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వారి వెంట జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, చేనేత జౌళి శాఖ ఏడి రాఘవరావు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపా రెడ్డి తదితరులు ఉన్నారు.
Read More:
కేటీఆర్ కనీసం సిగ్గైనా ఉండాలి కదా.. విప్ ఆది శ్రీనివాస్ సెన్సేషనల్ కామెంట్స్






