కేటీఆర్ డీజీపీకి క్షమాపణలు చెప్పు.. పోలీస్ అధికారుల సంఘం డిమాండ్

by Prasad Jukanti |

డీజీపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది.

కేటీఆర్ డీజీపీకి క్షమాపణలు చెప్పు.. పోలీస్ అధికారుల సంఘం డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డీజీపీ శివధర్ రెడ్డిపై (DGP ShivaDhar Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఖండించింది. ఎన్నడూ లేనంత అప్రమత్తతతో పోలీసు వ్యవస్థ పని చేస్తోందని స్టేట్ పోలీస్ డిపార్ట్ మెంట్ చట్టానికి, ప్రజలకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పోలీసు శాఖ నిష్పక్షపాతంగా పని చేస్తోందని అన్నారు. కేటీఆర్ ప్రస్తావించిన అన్ని ఘటనల్లో చట్టప్రకారం కేసులు పెట్టామని పోలీసుల పనితీరులో ఆక్షేపించవలసింది ఏమీ లేదన్నారు. డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఉపసంహరించుకుని పత్రికా ముఖంగా క్షమాపణలుచ చెప్పాలని డిమాండ్ చేశారు. సంస్కారయుతంగా, సభ్యతతో ప్రశ్నించాలని గుర్తు చేస్తున్నామన్నారు. కాగా పోలీస్ శాఖకు పింక్, రెడ్ బుక్ అంటూ ఏమీ లేవని తమకు ఉన్నదల్లా పోలీస్ బుక్ ఒక్కటేనని చట్టప్రకారం నడుచుకోవడమే మా పోలీస్ బుక్ అంటూ డీజీపీ శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ ఉపయోగించిన భాష తీరుపై పోలీసుల సంఘం అభ్యంతరం తాజాగా అభ్యంతరం వ్యక్తం చేసింది.

Next Story