- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Kavitha: దేశంలో లేని సమయం చూసే..? ఎమ్మెల్సీ కవితకి మరోసారి షాక్ ఇచ్చిన కేటీఆర్!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్ మధ్య గ్యాప్ పెరుగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha), కేటీఆర్ మధ్య గ్యాప్ పెరుగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అన్నాచెల్లెలి మధ్య దూరం రావడానికి గల కారణాలు ఏంటనేది ఇంత వరకు తెలియరాలేదు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్.. కవితకు మరోసారి షాక్ ఇచ్చారు. (Telangana Coal Mine Workers Union) తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత ప్లేసులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు. అయితే.. ఈ సంఘం కార్యవర్గ సమావేశంలో కొప్పుల ఈశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలను పార్టీ తరపున ముందుకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మీడియా ముందుకు కవిత వర్గం నాయకులు!
కవిత దేశంలో లేని సమయం చూసి బొగ్గుగని సంఘం నుంచి ఆమెను కేటీఆర్ (KTR) పూర్తిగా తొలగించినట్లు ఆమె వర్గం నేతలు గుర్రుగా ఉన్నారు. ట్రేడ్ యూనియన్ నిబంధనల ఉల్లంఘన చేశారని కవిత వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. జనరల్ బాడీ మీటింగ్ లేకుండానే (Koppula Eshwar) కొప్పుల ఈశ్వర్‌ను పూర్తి స్థాయి అధ్యక్షుడిగా అలా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై కవిత వర్గం నాయకులు ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉనట్లు తెలుస్తోంది. కవిత స్థానంలో కొప్పులను నియమించడంపై పార్టీ వర్గాల్లో గందరగోళం నెలకొన్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read..
KTR: మా మద్దతు వాళ్లకే.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మద్దతుపై తేల్చేసిన కేటీఆర్






