మీర్జాగూడ ప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-03 03:36:53  IST  )

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మందికి పైగా ప్రయాణికులు..

మీర్జాగూడ ప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఈ స్థాయిలో ప్రయాణికులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను ఆదుకోవాలని కోరారు. అలాగే గాయపడినవారికి మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు. ఘోర ప్రమాదానికి కారణమైన కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా.. ప్రమాదంలో 24 మందికి గాయాలవ్వగా వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రుల్లో అధికంగా ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వీకెండ్ కి ఇంటికి వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Read More..

మీర్జాగూడ ప్రమాదంలో 17కి చెరిన మృతుల సంఖ్య.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

Next Story