KTR: ఇక మనకున్న ఏకైక అస్త్రం అదే.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

by Prasad Jukanti |   (  Updated:2025-07-26 13:34:29  IST  )

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

KTR: ఇక మనకున్న ఏకైక అస్త్రం అదే.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ గడ్డి కూడా తింటుందని మేడిగడ్డ (Medigadda) బ్యారేజీ కుంగుబాటు విషయంలో కూడా ఈ కాంగ్రెస్ ఏదో చేసిందని నాకు అనుమానం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు పిల్లర్లు కుంగినప్పుడు ఏదో పెద్ద శబ్దం వచ్చింది అక్కడున్న రైతులు అప్పుడే చెప్పారన్నారు. కాళేశ్వరం వద్ద కొంత మంది వాళ్ల మనుషులు ఉన్నారని వారి ద్వారా ఏం పెట్టారో ఏమో కానీ ఏదో చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇవాళ ఉప్పల్ లో జరిగిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్రస్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సులో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఫోన్ ట్యాపింగ్ అనే అద్భుత కథని కనిపెట్టారని విమర్శించారు. ఇది కాంగ్రెస్‌కు డైవర్షన్ కోసం పనికి రావొచ్చేమో గానీ నష్టం జరగుతోంది మాత్రం తెలంగాణకు, రాష్ట్ర ప్రజలకు అన్నారు. బీఆర్ఎస్ (BRS) కు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క అస్త్రం సోషల్ మీడియా అని ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌లాగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్‌వీ విద్యార్థులు విజృంభించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తప్పులని ఎత్తి చూపుతూ.. ఇది ప్రజల్ని సతాయిస్తున్న ప్రభుత్వమని పోస్టులు పెట్టాలని సూచించారు. మన ఫోటోలు న్యూస్ పేపర్లలో చూపిస్తారని టీవీల్లో చూపిస్తారనే విషయం మర్చిపోవాలన్నారు.

Next Story