- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: రాష్ట్రానికి, హైదరాబాద్‌కు పట్టిన గ్రహణం వీడాలి.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
రాష్ట్రానికి, హైదరాబాదుకు పట్టిన ఈ గ్రహణం వీడాలి... మళ్లీ కేసీఆర్ రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రానికి, హైదరాబాదుకు పట్టిన ఈ గ్రహణం వీడాలి... మళ్లీ కేసీఆర్ రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. 2014 నుంచి 2023 వరకూ కేసీఆర్ (KCR) నాయకత్వంలో హైదరాబాద్ నగర అభివృద్ధి అప్రతిహతంగా కొనసాగిందన్నారు. ఐటీ రంగం నుండి ఫార్మా రంగం వరకు అన్ని రంగాలు పరుగులు తీశాయని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు వెల్లువెత్తాయని, శాంతి భద్రతల నుండి పర్యావరణ పరిరక్షణ వరకు అన్నీ అద్భుతంగా నిర్వహించామని పేర్కొన్నారు.
తమ హయాంలో నగర పౌరులందరికీ ఆ అభివృద్ధి ఫలాలు అందాయని, హైదరాబాద్ కీర్తి పతాక విశ్వ యవనికపై రెపరెపలాడిందని కొనియాడారు. కానీ రెండేళ్ల (Congress rule) కాంగ్రెస్ పాలనలో మన నగరం మసకబారిందని విమర్శించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రానికి, హైదరాబాదుకు పట్టిన ఈ గ్రహణం వీడాలని, మళ్లీ కేసీఆర్ రావాలని పిలుపునిచ్చారు. ట్వీట్ ఇదే..






