- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: ఇది ఏడో గ్యారంటీనా? ఆర్టీసీ చార్జీల పెంపుపై కేటీఆర్ సెటైర్లు
మహిళలకు ఉచితం అంటూనే పురుషులకు ఛార్జీలు డబుల్ చేసి వాళ్లని ట్రబుల్ చేస్తున్న రేవంత్ రెడ్డిని చూడటానికి జనాలు తహతహలాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాఖీ పండగ నేపథ్యంలో ప్రత్యేక సర్వీసుల పేరుతో టీజీఆర్టీసీ (TGRTC) టికెట్ చార్జీలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. నిన్నటి వరకు అమలు చేసిన ఈ చార్జీల మోతపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సైతం ఆర్టీసీ చార్జీల మోతపై ఎక్స్ వేదికగా స్పందించారు. సోషల్ మీడియాలో నెటిజన్లు చేసిన పోస్టులను తన ఎక్స్ హ్యాండిల్ లో షేర్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) సెటైర్లు వేశారు. 'సోనియా గాంధీ అవార్డు గ్రహీత రేవంత్ రెడ్డికి ఒక విన్నపం. ఏదైనా పండుగ రోజు మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల 'రేర్' దీవెనలను నేరుగా పొందాలని కోరుతున్నాను. పండుగొస్తే చాలు బెంబేలెత్తేలా చేస్తున్న రేవంతానికి సన్మానం చేయడానికి ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. మహిళలకు ఉచితం అంటూనే పురుషులకు ఛార్జీలు డబుల్ చేసి వాళ్లని ట్రబుల్ చేస్తున్న రేవంతాన్ని చూడటానికి జనాలు తహతహలాడుతున్నారు. పండగ రోజు కూడా ప్రజల సొమ్ములు కొల్లగొట్టాలంటే ప్రత్యేకమైన టాలెంట్ కావాలి! రాఖీ రోజు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడం అంటే మామూలు తెలివి కాదు!. పోని ఒక పని చెయ్యండి - ఈ పెంచుడు కార్యక్రమాన్ని “ఏడో గారంటీ” అని ప్రచారం చెయ్యండి, వీలయితే “పండగ గిఫ్ట్” అని కార్డులు వేసి పంచిపెట్టండి! జనం బాగా గుర్తుపెట్టుకుంటారు!'అంటూ విమర్శలు చేశారు.






