- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్‌చిట్.. అన్న కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
లిక్కర్ స్కామ్‌లో కవితకు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లిక్కర్ స్కామ్ కేసు పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని దింపేశారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవార్, మంత్రి సిసోడియాతో పాటు కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కేసులో ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేసింది. అయితే తాజాగా దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లిక్కర్ స్కామ్ కేసు పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని దింపేశారని అన్నారు. లిక్కర్ స్కామ్ పేరుతో బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ కొట్టారని పేర్కొన్నారు. ఈ రోజు కోర్టులో కవితకు న్యాయం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులపై నమోదైన ప్రతి తప్పుడు కేసు, రాజకీయ ప్రేరేపిత కేసులేనని తేలుతాయని చెప్పారు. నిజం గెలవనంత వరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి ఆరోపణలు వస్తూనే ఉంటాయన్నారు. ప్రజలను తప్పుదారిపట్టించేలా రూపొందించిన మీడియా కథనాలు వచ్చాయన్నారు. దురదృష్టవశాత్తు ఇది ఇండియాలో కొత్త ప్రమాణంగా మారిందన్నారు. ఇక్కడ ఆరోపణలు నిజాలను కనుమరుగయ్యేలా చేస్తాయని, మీడియా కథనాలు వాటికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయన్నారు. కానీ చివరికి న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు.






