పాత ‘కారు’తో ఫొటో పెట్టిన చంద్రబాబు.. కేటీఆర్ ఏమన్నారంటే?

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు జరుగుతాయని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పాత ‘కారు’తో ఫొటో పెట్టిన చంద్రబాబు.. కేటీఆర్ ఏమన్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు జరుగుతాయని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా అధికారులకు జూబ్లీహిల్స్ ఫలితం ఒక హెచ్చరిక అవుతుందని అన్నారు. జూబ్లీహిల్స్‌పై టీడీపీ వైఖరి వారి అంతర్గత విషయమని చెప్పారు. కేసీఆర్ మా పాశుపతాస్త్రం.. దానిని మేమింకా ప్రవేశపెట్టలేదని అన్నారు. మా ఫ్యూచర్ సీఎం అభ్యర్థి మళ్లీ కేసీఆరే.. ఇందులో ఎవరికీ.. ఎలాంటి అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలోనూ అమెరికా స్టైల్‌లో రెండు పక్షాల మధ్య లైవ్ డిబేట్ పెట్టాలని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అరెస్టుపై నా మాటల్ని అపార్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇటీవల చంద్రబాబు పాత కారుతో దిగిన ఫొటోలు బీఆర్ఎస్ గురించే అని తాము అనుకోవట్లేదు.. ఆయన గత స్మృతులను స్మరించుకున్నారనే అనుకుంటున్నామని అన్నారు. వందకు వందశాతం జూబ్లీహిల్స్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story