భువనగిరి సభలో కేటీఆర్ రియలైజ్.. ‘అసెంబ్లీ’ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

భువనగిరి సభలో కేటీఆర్ రియలైజ్.. ‘అసెంబ్లీ’ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు

భువనగిరి సభలో కేటీఆర్ రియలైజ్.. ‘అసెంబ్లీ’ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో మన సత్తా ఏంటో రాష్ట్రం మొత్తం తెలిసిపోయిందని అన్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అసలు విషయం తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మనల్ని బయటి వ్యక్తులు ఓడించలేదు.. మనల్ని మనమే ఓడించుకున్నామని స్పష్టంగా తెలుస్తోందన్నారు. చేసిన పని చెప్పుకోలేక.. చేసిన అభివృద్ధి చూపించుకోవడంలో విఫలం చెందామని తెలిపారు. నిజానికి పదేళ్లలో కేసీఆర్(KCR) పని దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గ్రామాల్లో వైకుంఠదామాలు కట్టినం, రైతు వేదికలు కట్టినం, డంప్ యార్డ్‌లు కట్టినం, గ్రామానికో ట్రాక్టర్ ఇచ్చినం, రైతుబంధు ఇచ్చినం, దళితబంధు ఇచ్చినం, కల్యాణలక్ష్మి ఇచ్చినం, గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు కట్టినం, హరితహారం ద్వారా చెట్లు నాటి అనేక పనులు చేశామని అన్నారు. ఇవన్నీ చెప్పుకోలేకపోవడంతో పాటు కిందిస్థాయి నాయకులను పట్టించుకోవడంలో కూడా విఫలం చెందామని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం భిన్నంగా వచ్చిందని కేటీఆర్ రియలైజ్ అయ్యారు.

స్పీకర్ నిర్ణయం సరికాదు :

ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం సరికాదు. సీఎం రేవంత్ రెడ్డి ఏది చెబితే స్పీకర్ అదే చేస్తున్నాడు. ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ము లేదు.. చేస్తే ఓడిపోతామనే భయం అందరిలోనూ మొదలైంది. నిన్న, మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన కడియం శ్రీహరి కూడా ఇప్పుడు రాజీనామా చేసి ఉప ఎన్నికకు వచ్చే ధైర్యం చేయడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా మిగతా ఎమ్మెల్యేలకు ప్రజల్లో మొఖం లేదని అన్నారు. ఇంతకాలం గౌరవంగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో జతకట్టి ఉన్న పేరు పోగొట్టుకుంటున్నాడని చెప్పారు.

Next Story