- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్... ప్రభుత్వానికి, తీన్మార్ మల్లన్నకు నోటీసులు
తన పై నమోదైన కేసులు కోట్టివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం హై కోర్టులో విచారణ జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : తన పై నమోదైన కేసులు కోట్టివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు(High Court)లో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)కు ప్రభుత్వానికి కౌంటర్ దాఖాలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 13 వతేదికి వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనను ఓడించేందుకు ఫేక్ వీడియోలు వైరల్ చేశారని పేర్కొంటూ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు గతేడాది మే నెలలో కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని సైతం నిందితులుగా పేర్కోన్నారు. కేసు కొట్టేయాలని కోరుతూ కేటీఆర్, జగదీశ్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. ప్రతివాదులకు కోర్ట్ నోటీసులు జారీ చేసింది.






