KTR : కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు : కేటీఆర్ అడ్వొకేట్

by Muthe.Rajitha |

కేటీఆర్(KTR) సుప్రీంకోర్టు(Supreme Court)లో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్(Quash Pitition) పై ఆయన అడ్వొకేట్ మోహిత్ రావు క్లారిటీ ఇచ్చారు.

KTR : కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు : కేటీఆర్ అడ్వొకేట్
X

దిశ, వెబ్ డెస్క్ : కేటీఆర్(KTR) సుప్రీంకోర్టు(Supreme Court)లో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్(Quash Pitition) పై ఆయన అడ్వొకేట్ మోహిత్ రావు క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని అన్నారు. లీగల్ ఒపీనియన్ ప్రకారం తాము పిటిషన్ విత్ డ్రా చేసుకున్నామని పేర్కొన్నారు. ఏ కోర్టులో అయినా అప్పీల్ చేసుకోవచ్చని, సెక్షన్ 13.1A పీసీ యాక్ట్ వర్తించదని తాము కోర్టులో వాదనలు వినిపించామని తెలియజేశారు.

ఫార్ములా ఈ-రేసు(Farmula E Car Race) కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టు(Supreme Court)లో SLP వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టి... ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో క్వాష్ పిటిషన్‌ను కేటీఆర్ విత్ డ్రా చేసుకున్నారు. ఈ మేరకు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేపట్టే విచారణకు కేటీఆర్ హాజరుకానున్నారు.

Next Story