- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR : అధికారం ముఖ్యం కాదు : కేటీఆర్
తెలంగాణ ఆస్తిత్వమే తమకు ముఖ్యమని, అధికారం ముఖ్యం కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR).

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆస్తిత్వమే తమకు ముఖ్యమని, అధికారం ముఖ్యం కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR). నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS Cheif KCR) అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశ అనంతరం కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజా ఉద్యమాలకు, పోరాటాలకు తెలంగాణ పురిటి గడ్డ అని, కోట్లాది తెచ్చుకున్న తెలంగాణను ఆగం కానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రయోజనాలు సాధించాలంటే ఒక్క బీఆర్ఎస్‌తో మాత్రమే సాధ్యమని అన్నారు. కేసీఆర్ మళ్ళీ సీఎం అవ్వాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, అయినప్పటికీ .. తమకు అధికారం ముఖ్యం కాదని, తెలంగాణ అస్థిత్వం, పరిరక్షణే ముఖ్యమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు(BRS Silver Jubly Celebrations) ఏడాది పాటు ఘనంగా... ప్రజా రజతోత్సవాలుగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉద్యమ సహచరులను ఒక్కటి చేసి, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు. పార్టీ సంస్థాగత మీటింగ్ ఏప్రిల్ లో ఉంటుందని.. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, పార్టీ కమిటీలు, రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక వంటివి కేసీఆర్ నేతృత్వంలో నిర్వహిస్తామని తెలిపారు. అదే విధంగా పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాలు జరుపుతామని వెల్లడించారు.






