Dubai Car Racing: తమిళ నటుడు అజిత్‌పై KTR ప్రశంసలు

by Gantepaka Srikanth |

దుబాయ్‌ వేదికగా జరుగుతోన్న 24హెచ్‌ దుబాయ్‌ కారు రేసింగ్‌(Dubai Car Racing)లో తమిళ అగ్ర కథానాయకుడు అజిత్(Actor Ajith) అదరగొట్టారు.

Dubai Car Racing: తమిళ నటుడు అజిత్‌పై KTR ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్‌ వేదికగా జరుగుతోన్న 24హెచ్‌ దుబాయ్‌ కారు రేసింగ్‌(Dubai Car Racing)లో తమిళ అగ్ర కథానాయకుడు అజిత్(Actor Ajith) అదరగొట్టారు. ‘అజిత్‌ కుమార్ రేసింగ్‌’ పేరుతో ఇటీవల ఒక రేసింగ్‌ టీమ్‌ను ప్రకటించిన ఆయన.. దుబాయ్‌ కారు రేసింగ్‌లో పాల్గొని గ్రాండ్ విక్టరీ సాధించారు. ఈ పోటీల్లో ఆయన టీమ్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నది. ఇటీవల యాక్సిడెంట్‌ ఆయన పోటీ నుంచి తప్పుకోగా.. ఆయన టీమ్ బరిలో నిలిచి సత్తా చాటింది. తాజాగా.. ఈ విజయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. రేసింగ్ మీద ఆయనకున్న ఫ్యాషనే విజయానికి చేరువ చేసిందని అన్నారు. ‘ఎంతో మందికి మీరు ఆదర్శం అజిత్ గారు’ అని ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు.. ప్రస్తుతం అజిత్‌ తన 62వ చిత్రం ‘విదా ముయార్చి’లో నటిస్తున్నారు. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అజిత్‌ సరసన త్రిష నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు.. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అనే మరో సినిమాలోనూ నటిస్తున్నారు. దీనికి అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Next Story