కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడకు.. ఎంపీ చామల హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-05 16:24:29  IST  )

తెలంగాణ (Telangana)లో రైతు రాజ్యం ఎవరు తెచ్చారో చర్చించేందుకు సిద్ధం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేసీఆర్‌కు విసిరిన సవాల్‌పై కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే.

కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడకు.. ఎంపీ చామల హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో రైతు రాజ్యం ఎవరు తెచ్చారో చర్చించేందుకు సిద్ధం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేసీఆర్‌కు విసిరిన సవాల్‌పై కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. చర్చకు కేసీఆర్ రారని, తానే వస్తానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో చర్చించేందుకు సిద్ధమన్నారు. సోమాజిగూడ (Somajiguda) ప్రెస్ క్లబ్‌లో ఈనెల 8న 11 గంటలకు చర్చకు వస్తామని కేటీఆర్ (KTR) ప్రతి సవాల్ విసిరారు. మీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని తాము చాలని.. ఎక్కడికి పిలిచినా రెడీ అన్నారు. 72 గంటల సమయం రేవంత్ రెడ్డికి ఇస్తున్నామని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) స్పందించారు. కేటీఆర్ ఇకనైనా ఉత్తర కుమారుడి మాటలు బంద్ చేయాలని హితవు పలికారు. ఆయనకు ఛాలెంజ్‌లు అచ్చిరావంటూ సెటైర్లు వేశారు. గంతంలో కేటీఆర్ ఛాలెంజ్‌లు చేసి తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే స్థాయి, అర్హత నీకు ఆయనకు లేవని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఫామ్ హౌస్‌లో ఉన్న తండ్రిని మందు అసెంబ్లీకి తీసుకొచ్చి చర్చకు కూర్చొబెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తండ్రిని బతిమిలాడుకుని ప్రతిపక్ష హోదా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు రావాలని అన్నారు. అంతే కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ.. తొడలు కొడితే జనం పిచ్చోడని అనుకుంటారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Next Story