CM రేవంత్ అల్లుడిపై మరోసారి KTR కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-27 09:49:17  IST  )

CM రేవంత్ అల్లుడిపై మరోసారి KTR కీలక వ్యాఖ్యలు

CM రేవంత్ అల్లుడిపై మరోసారి KTR కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అల్లుడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ శనివారం మహబూబాబాద్‌లో పర్యటించారు. నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్‌లను సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. తాను గుంటూరులో చదువుకోవడం తప్పైతే.. భీమవరం నుంచి అల్లుడిని తెచ్చుకున్న సీఎం రేవంత్ రెడ్డిది కూడా తప్పేనని అన్నారు. కేసీఆర్ కాలు బయటపెట్టగానే కొందరు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడొచ్చా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలుగు భాష ఒక్కటే వచ్చు.. నాకు నాలుగు భాషలు వస్తాయి.. నేను ఆ నాలుగు భాషల్లో తిట్టగలను.. కానీ సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నానని అన్నారు. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నది కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఎన్నో హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి అన్నీ ఎగవేశారు.. హామీల గురించి ప్రశ్నిస్తే రేవంత్‌ బూతులు తిడుతున్నారు. తిట్ల భాష మాకూ వచ్చు.. కానీ మేం తిట్టం. పెంచుతామన్న పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారో సీఎం చెప్పాలి. రాష్ట్రంలో రాబోయేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story