KTR: అల్లు అర్జున్‌ను అందుకే టార్గెట్ చేశారు.. మరోసారి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

KTR: అల్లు అర్జున్‌ను అందుకే టార్గెట్ చేశారు.. మరోసారి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక.. ప్రజల నుంచి విమర్శలు వస్తాయనే భయంతో డైవర్ట్ చేసే క్రమంలో అల్లు అర్జున్‌(Allu Arjun)ను టార్గెట్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై నుంచి అటెన్షన్-డైవర్షన్‌లో భాగంగానే సినిమా వాళ్ళ పైన రేవంత్ రెడ్డి మాట్లాడారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన మరణాలపైన రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు.. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు కుటుంబాలు కాదు.. మనుషులు కాదు అన్నట్టు.. సినిమా వాళ్లపైన పడి అటెన్షన్-డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పాకులాడారని విమర్శించారు. సినిమా వాళ్ళ నుంచి సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు సైలెన్స్‌గా ఉన్నాడని కీలక ఆరోపణలు చేశారు. సినిమా వాళ్ళతోపాటు ఆత్మహత్యలు చేసుకున్న గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రైతన్నలు, నేతన్నల మరణాల పైన స్పందించాలని డిమాండ్ చేశారు. వాళ్లకు కూడా కనీసం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అన్నారు. ఇచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడతామని ప్రకటించారు. హైడ్రా(Hydra)ను కూడా డైవర్షన్‌లో భాగంగానే తీసుకొచ్చారని అన్నారు.

Next Story