KTR: తెలంగాణలో రుణమాఫీపై రాజ్యసభలో నిర్మలా కామెంట్స్.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!

by Kema Shiva Kumar |

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేపట్టిన రైతు రుణమాఫీపై బుధవారం రాజ్యసభ (Rajya Sabha)లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సంచలన వ్యాఖ్యలు చేశారు.

KTR: తెలంగాణలో రుణమాఫీపై రాజ్యసభలో నిర్మలా కామెంట్స్.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేపట్టిన రైతు రుణమాఫీపై బుధవారం రాజ్యసభ (Rajya Sabha)లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సగం సగం రుణమాఫీతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని కామెంట్ చేశారు. కొందరికే రుణమాఫీ చేసి రేవంత్ సర్కార్ అందరికీ చేశామని చెబుతోందని ఆరోపించారు. దీంతో అన్ని బ్యాంకులు అందరినీ పరిగణలోకి తీసుకుని రుణమాఫీ కాకపోయినా వన్‌ టైమ్ సెటిల్మెంట్‌ (One Time Settlement) కింద రుణాలను రద్దు చేస్తోందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆ తరువాత కొత్త రుణాలు తీసుకునేందుకు రైతులు అర్హత కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ (Telangana) రైతుల దీన స్థితిని ఎత్తిచూపిన నిర్మలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 30 శాతం మంది రైతులు రుణాలు మాఫీ కాలేదని ఆరోపించారు. అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని.. రైతుబంధు విడుదల చేయడం లేదని కామెంట్ చేశారు. ఎక్కడ చూసినా నీటి సంక్షోభం ఉందని అన్నారు. దశాబ్దం తరువాత తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయితే, స్థానిక బీజేపీ నేతలు మాత్రం సీఎంకు వ్యక్తిగత సిబ్బందిలా పని చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story