- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills: మాగంటి సునీత కుటుంబ సభ్యులను కలిసిన కేటీఆర్
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) శనివారం ఉదయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha) నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) శనివారం ఉదయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha) నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన తీరును కేటీఆర్ అభినందించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ ధైర్యం చెప్పారు. సునీతతో పాటు వారి పిల్లలను కూడా ప్రశంసించారు. కాగా, జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 24,729 ఓట్ల మెజారిటీతో గెలిచిన నవీన్ యాదవ్ గెలిపొందారు. పోస్టల్ బ్యాలెట్ మొదలు ఫస్ట్ రౌండ్ నుంచి చివరి వరకు కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. రౌండ్ రౌండ్‌కు మెజార్టీ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా షేక్‌పేట్, వెంగళ్‌రావు నగర్, రెహమత్ నగర్ డివిజన్లలో కాంగ్రెస్‌కు మంచి ఆధిక్యం లభించింది. దీంతో భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచి.. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. మరోవైపు బీజేపీ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు.






