- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: బీఆర్ఎస్ లో సీబీఐ టెన్షన్!.. హుటాహుటీన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ (BRS) తాజాగ గన్ పార్క్ వద్ద ధర్నాకు దిగింది. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ భేటీ (Erravalli farmhouse meeting) జరిగింది. కాళేశ్వరం కేసు సీబీఐకి ఇవ్వడం, అసెంబ్లీ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా కాళేశ్వరం రిపోర్టు పై ఇప్పటికే కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను ఇవాళ అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఇవాళ హైకోర్టులో మెన్షన్ చేశారు. కాళేశ్వరం దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈ పిటిషన్ పై రేపు విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలపడంతో రేపటి వరకు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫున లాయర్ ఆర్యమ సుందరం కోరారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.






