- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రమేశ్ ఆరోపణలపై స్పందన.. కేటీఆర్ మరో సంచలన ప్రకటన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్(CM Ramesh) తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్(CM Ramesh) తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్ట్ తర్వాత నా ఇంటికి వచ్చిన సంగతి మరిచిపోయావా? అని ప్రశ్నించారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పలేదా..? అని అడిగారు. కవితను రిలీజ్ చేస్తే బీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పిన మాట మరిచావా..? అని సీరియస్ అయ్యారు. ‘నా వల్లే నువ్వు ఎన్నికల్లో గెలిచావు. 300 ఓట్ల మెజారిటీతో ఎలా గెలిచావు నాకు తెలుసు. నీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి సంస్కారం అడ్డువచ్చి చెప్పలేదు’ అని ఎంపీ సీఎం రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటిపై తాను ఎక్కడ చర్చించడానికైనా సిద్ధమని ప్రకటించారు.
తాజాగా సీఎం రమేశ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రమేశ్, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇద్దరూ కలిసి వస్తే చర్చలకు తాను సిద్ధమని ప్రకటించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా విలీనం అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదు అని స్పష్టం చేశారు. ఇరకాటంలో పడిన ప్రతీసారి కాంగ్రెస్, బీజేపీలు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.






