లండన్ బయల్దేరిన కేటీఆర్

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్ పర్యటనకు వెళ్లారు.

లండన్ బయల్దేరిన కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్ పర్యటనకు వెళ్లారు. ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించే సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ‘ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా’ అనే అంశంపై తెలంగాణ అభివృద్ధి కోసం అనుసరించిన విధానాల గురించి ప్రసంగించనున్నారు. బుధవారం రాత్రి బయలుదేరి వెళ్లిన కేటీఆర్.. తిరిగి ఈ నెల 24న హైదరాబాద్ చేరుకోనున్నారు.

Next Story