- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
జాబ్ క్యాలెండర్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటనలో మోసం ఉందంటూ శుక్రవారం గన్‌పార్క్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ సభ్యులపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పచ్చి బూతులు తిడుతున్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ వస్తే యువత తరిమివేయడం ఖాయమన్నారు. తాము కేవలం జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలని కోరినట్లు కేటీఆర్ చెప్పారు.
తమకు కనీసం రెండు నిమిషాలు కూడా మైక్ ఇవ్వలేదు. అసలు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొత్త ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. మభ్యపెట్టి ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేరు అని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వంలో విషయం లేదని తేలిపోయింది. అందుకే ఇక బూతులు స్టార్ట్ చేశారని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నార.. మర్చిపోయి నిరుద్యోగులను రోడ్డు పడేశారని అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం నిరుద్యోగులను రెచ్చగొట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. నాలుగు పేపర్ల మీద ఇష్టమొచ్చింది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అంటున్నారని విమర్శించారు.