KTR : అలిశెట్టికి కేటీఆర్..కవిత నివాళులు

by Y. Venkata Narasimha Reddy |

కవి, ఫోటోగ్రాఫర్, చిత్రకారుడు అలిశెట్టి ప్రభాకర్(Alishetti Prabhakar)జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ఎక్స్ వేదికగా ఘన నివాళులు అర్పించారు.

KTR : అలిశెట్టికి కేటీఆర్..కవిత నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్ : కవి, ఫోటోగ్రాఫర్, చిత్రకారుడు అలిశెట్టి ప్రభాకర్(Alishetti Prabhakar)జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ఎక్స్ వేదికగా ఘన నివాళులు అర్పించారు. మరణం నా చివరి చరణం కాదు..మౌనం నా చితాభస్మం కాదు..నిర్విరామంగా, నిత్యనూతనంగా కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహను నేను"అంటూ సామాజిక చైతన్యమే ధ్యేయంగా కవిత్వం రాసిన తెలంగాణ బిడ్డ అలిశెట్టి ప్రభాకర్ అని కేటీఆర్ స్మరించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఎక్స్ వేదికగా అలిశెట్టికి నివాళులు అర్పించారు. తన కవిత్వాన్ని అభాగ్యుల గొంతుకగా మలిచిన ప్రజాకవి... సమాజం కోసం పదాలకు పదును పెట్టిన అక్షర యోధుడు దివంగత అలిశెట్టి ప్రభాకర్ అని కవివ నివాళులు అర్పించారు.

బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్(R.S. Praveen Kumar)సైతం అలిశెట్టికి ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. 1980-90 దశకంలో యువతరాన్ని తన పదునైన కవిత్వంతో ఎంతగానో ప్రభావితం చేసిన కలం యోధుడు ప్రభాకర్ అని శ్లాఘించారు. కమర్షియల్ సెక్స్ వర్కర్ల పై రక్తరేఖ లో అలిశెట్టి రాసిన ‘వేశ్య’ ఒక టైమ్ లెస్ క్లాసిక్ అని..అలిశెట్టి కవితలను యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా చేర్చాలని..రక్తరేఖను తప్పకుండా చదవండని పేర్కొన్నారు.

Next Story