రాష్ట్రంలో డ్రగ్స్​ సృష్టి కర్త కేటీఆరే : కాంగ్రెస్ ​నేత గజ్జెల కాంతం

by Muthe.Rajitha |

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల డ్రగ్స్ సృష్టి కర్త బీఆర్​ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆరే నని టీ పీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం హాట్ కామెంట్స్ చేశారు.

రాష్ట్రంలో డ్రగ్స్​ సృష్టి కర్త కేటీఆరే : కాంగ్రెస్ ​నేత గజ్జెల కాంతం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల డ్రగ్స్ సృష్టి కర్త బీఆర్​ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆరే నని టీ పీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ లో డ్రగ్స్ కాంట్రాక్ట్ ను కేటిఆర్ తీసుకున్నారని , గత పదేండ్లలో రూ. 10 వేల కోట్ల వరకు డ్రగ్స్ సరఫరా చేసిండని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఇందుకు వెయ్యి మంది సిబ్బందిని పెట్టుకొని రాష్ట్రమంతా సరఫరా చేసుకున్నారని విమర్శించారు. అన్ని మండలాలకు, గ్రామాలకు డ్రగ్స్ సరఫరా చేశారని, ఈ విధంగా గ్రామాలలోని ఎస్​సీ, ఎస్​టీ కుటుంబాలను సర్వ నాశనం చేసిండని ఆరోపించారు. ఈ డ్రగ్స్​వినియోగించే యువత చాలామంది చనిపోయారన్నారు.

రాజధాని హైదరాబాద్​లోనూ కాలేజీ యువతకు డ్రగ్స్ , గంజాయ్ అలవాటు చేసిందే కేటీఆర్ అని గజ్జల కాంతం తీవ్రంగా విమర్శించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్​లో 5 వేల మందికి డ్రగ్స్ అలవాటు చేసి విచ్చల విడిగా పేదల డబ్బులను దోపిడీ చేసిండన్నారు. ఒక వైపు గంజాయి అలవాటు చేసి మరో వైపు పోలీసులతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టించే స్థితిని తీసుకువచ్చిందే కేటీఆర్​అని ఆయన ఆరోపించారు. ఇలా చేయడం కేటీఆర్ కు అలవాటు కూడానని ఆయన వ్యాఖ్యానించారు.

కొత్తగా చలన చిత్ర పరిశ్రమకి వచ్చిన నటీ, నటులకు డ్రగ్స్ అలవాటు చేసి తర్వాత కేసులు పెట్టించారని, ఇలా ఇతర దేశాల నుండి తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ ను తీసుకొచ్చిందే కేటీఆర్ అని గజ్జల కాంతం ఆరోపించారు. తెలంగాణ రాక ముందు 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ అసలే లేవని, అది ఏంటో కూడా అప్పట్లో ఎవరికీ తెలియదన్నారు. 2014 తర్వాత బీఆర్​ఎస్​అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రికాగా, కేటిఆర్ మంత్రి అయ్యాక డ్రగ్స్ ను తెలంగాణ యవతకు అలవాటు చేశారని, అది కూడా కేసీఆర్ డైరెక్షన్ లోనే కు తెలిసి కేటిఆర్ ఇచ్చిండని ఆరోపించారు. తద్వారా దేశంలో డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణను కేటీఆర్ మార్చిండని మండిపడ్డారు.

తెలంగాణలో గంజాయి, ఇసుక వాణిజ్యం ఇలా దేన్ని కేటీఆర్ వదిలి పెట్టలేదని గజ్జల కాంతం అన్నారు. రజాకార్ల కంటే దుర్మార్గులు కేసీఆర్,కేటిఆర్ అని, వీళ్లను అండమాన్ జైల్లో వేయాలని అన్నారు. రాజకీయాల్లోని భార్య భర్తల ఫోన్ల నే టాపింగ్ చేసిన దుర్మార్గులు కేసీఆర్ , కేటీఆర్​లు అని , వీరిని చార్మినార్ దగ్గర ఉరి తీసినా తప్పులేదని గజ్జల కాంతం అన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్​రెడ్డి ముందుకు వచ్చి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తు, డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపుతున్నారన్నారు.

Next Story