‘మేము పవర్‌లో ఉన్నప్పుడు ఆ పని ముందే చేసేవాళ్లం’.. సర్కార్‌పై కేటీఆర్ సీరియస్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-28 06:42:42  IST  )

భారీ వర్షాలు(Heavy Rains), వరదల నేపథ్యంలో పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

‘మేము పవర్‌లో ఉన్నప్పుడు ఆ పని ముందే చేసేవాళ్లం’.. సర్కార్‌పై కేటీఆర్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు(Heavy Rains), వరదల నేపథ్యంలో పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నేతలు ఈ టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో వర్ష సూచన ఆధారంగా అనేక సూక్ష్మమైన అంశాలపై దృష్టి పెట్టేవాళ్ళమని చెప్పారు. NDRF, SDRF విభాగాలతో నిరంతర సమన్వయం చేసుకుంటూ పనిచేసేవాళ్ళమని గుర్తుచేశారు.

‘దురదృష్టవశాత్తు, ఈ ప్రభుత్వం మనం స్పందించి ఒత్తిడి తీసుకువచ్చే వరకు కూడా పెద్దగా స్పందించడం లేదు. ప్రజల వెంట నిలబడే పార్టీ మనది కాబట్టి, కార్యకర్తలు ప్రజల కష్టాల్లో అండగా నిలబడాలి. కార్యకర్తల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలి. వరదల్లో చిక్కుకున్న వారికి, వర్షాల వల్ల నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించాలి. తీవ్రమైన వరద ఉన్నచోట ఆహారం, తాగునీరు వంటి నిత్యావసరాలు అందించాలి. బురద నిండిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అవసరమైతే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి, వ్యాధులు ప్రబలకుండా చూడాలి. మనం చేసే ప్రతి సహాయకార్యాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’ అని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Also Read..

కేటీఆర్‌కు KCR ఫోన్.. బీఆర్ఎస్ శ్రేణులను అప్రమత్తం చేయాలని ఆదేశం

Next Story