Harish Rao : కేటీఆర్ వ్యక్తి కాదు శక్తి : హరీష్ రావు

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేడు ఫార్ములా ఈ రేసింగ్ కేసు(Formula E Racing Case)లో ఏసీబీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే.

Harish Rao : కేటీఆర్ వ్యక్తి కాదు శక్తి : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేడు ఫార్ములా ఈ రేసింగ్ కేసు(Formula E Racing Case)లో ఏసీబీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం కేటీఆర్, ఆ పార్టీ మరో ముఖ్యనేత హరీష్ రావు(Harish Rao) మీడియా సమావేశం నిర్వహించి, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. కేటీఆర్ కేవలం ఒక వ్యక్తి కాదని, శక్తి అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ పైన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు.

అందులో భాగంగానే ఈ తప్పుడు కేసులు మోపి, విచారణ పేరుతో తిప్పుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ పాలనలో తాము తుమ్మినా, దగ్గినా కేసులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ కేవలం ఒక వ్యక్తి కాదని, తెలంగాణ మొత్తం తన వెనుక నిలబడిన మహా శక్తి అన్నారు. ఆయనకు లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అండగా ఉన్నారని, ముట్టుకుంటే భస్మం అవుతారని హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.

Next Story