- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగళూరులో ప్రతిష్టాత్మక సదస్సు.. చీఫ్ గెస్ట్‌గా రావాలని కేటీఆర్‌కు ఆహ్వానం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR)కు ప్రతిష్టాత్మక సదస్సులో కీలక ప్రసంగం చేయాలని ఆహ్వానం లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR)కు ప్రతిష్టాత్మక సదస్సులో కీలక ప్రసంగం చేయాలని ఆహ్వానం లభించింది. టెక్ & ఇన్నోవేషన్ సమ్మిట్(TIS) 2025కు కేటీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సదస్సు 2025 ఫిబ్రవరి 27-28 తేదీల్లో బెంగళూరులో జరగనుంది.
సదస్సు తొలి రోజున, Driving Digital India: Innovations & Strategies for a Technologically Advanced Future అనే అంశంపై కేటీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. “ది ఏఐ టెకేడ్ (Techade)” థీమ్‌తో నిర్వహించనున్న ఈ సమిట్‌లో, కృత్రిమ మేధస్సు (AI) వ్యాపారం మరియు సాంకేతికతపై చూపించే ప్రభావంపై ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ ప్రభుత్వాలు ప్రతినిధులు చర్చించనున్నారు.
ఈ ఈవెంట్‌లో 150 పైచిలుకు ప్రముఖ స్పీకర్లు పాల్గొనడంతో పాటు AI, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆటోటెక్, స్పేస్‌టెక్, హెల్త్‌టెక్ వంటి రంగాల్లో విశేషమైన సెషన్లు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ప్రతిష్టాత్మక గాలా ఐడియా అవార్డ్స్ కార్యక్రమం కూడా ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.






