- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవన్ రెడ్డికి కేటీఆర్ ఆహ్వానం.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోనున్న మాజీ మంత్రి
జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని కేటీఆర్ కలిశారు. కేసీఆర్ సూచనతో ఆయన్ని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 2014 ఎన్నికల ముందు కేసీఆర్ జీవన్‍రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ జీవన్ రెడ్డి నిబద్ధత గల నాయకుడని కాంగ్రెస్ లోనే కొనసాగారని చెప్పారు. ఇవాళ జగిత్యాలలో జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కేటీఆర్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సూచన మేరకు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్‍లోకి ఆహ్వానించామన్నారు. జీవన్‍రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, కేసీఆర్‍తో ఆయనకు నాలుగు దశాబ్దాల పరిచయం, స్నేహం ఉందన్నారు. కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. అప్పుడు ముందుగా జీవన్ రెడ్డికి మైక్ ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. బోర్నపల్లికి ఒక బ్రిడ్జి కావాలని జీవన్ రెడ్డి నాడు కేసీఆర్ కోరారు. వారి మీదున్న గౌరవంతో రూ. 75 కోట్ల బ్రిడ్జిని కేసీఆర్ వెంటనే మంజూరు చేశారని గుర్తు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు చాలా ప్రయత్నించారని అన్నారు.
కేసీఆర్ ను కలిశాక నిర్ణయం చెబుతా: జీవన్ రెడ్డి
జీవన్ రెడ్డిని ఇంటికి వెళ్లి ఆహ్వానించేందుకు బీఆర్ఎస్ నేతలంతా సహకరించారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి వర్గంలో ఒక ఆక్రోశం వ్యక్తం అవుతోందన్నారు. పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారని, ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు రూ.27 వేల కోట్లు బాకీ ఉందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి తగని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూడు నెలల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పింది మీరే కదా అని ప్రశ్నించారు. గ్యారెంటీ కార్డులు ప్రజలకు ఇచ్చింది కాంగ్రెస్ కాదా నికార్సయిన కాంగ్రెస్ నాయకులను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అంటున్నారు. అధికారం ఉందనే అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాగా కేసీఆర్‍ను కలిసి తర్వాత తన నిర్ణయం చెబుతానని జీవన్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.






