- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటి ప్రచార శైలి కనిపెట్టిందే మేము..మమ్మల్ని చూసి కాపీ కొడుతున్నారు: కేటీఆర్
జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వినూత్నంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. చుట్టూ ఎల్ఈడీలతో పాటు లైట్స్ ఏర్పాటు చేసి మధ్యలో నుండి కేటీఆర్ ప్రసంగించారు. చూడ్డానికి ఆడియో ఫంక్షన్ మాదిరిగా బీఆర్ఎస్ ప్రచార శైలి కనిపిస్తుందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వినూత్నంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. చుట్టూ ఎల్ఈడీలతో పాటు లైట్స్ ఏర్పాటు చేసి మధ్యలో నుండి కేటీఆర్ ప్రసంగించారు. చూడ్డానికి ఆడియో ఫంక్షన్ మాదిరిగా బీఆర్ఎస్ ప్రచార శైలి కనిపిస్తుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా ప్రచారశైలి గురించి ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కొత్త ప్రచారశైలిని ప్రవేశపెట్టాలని తాము అనుకున్నామని చెప్పారు.
ఊకదంపుడు ఉపన్యాసాలు కాకుండా వాళ్లు ఏం మాట్లాడారు, ఏం హామీ ఇచ్చారు దానికి మా సమాధానం ఏంటి అన్నది చెప్పాలని అనుకున్నామన్నారు. కాంగ్రెస్ చెప్పిన మాటలేంటి ఎలా ఫెయిల్ అయ్యింది అనేదాన్ని ప్రజలకు చూపించాలని అనుకున్నట్టు తెలిపారు. అదే విధంగా హైడ్రా గురించి, రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడారు అనేవి చూపించి వాటి గురించి మాట్లాడామన్నారు. భారతదేశంలో మొదటిసారి తామే ఇలాంటి ప్రచారం చేశామన్నారు. తమను చూసి ఇతర పార్టీలు కాపీ కొడుతున్నాయన్నారు. కానీ వాళ్లకు కంటెంట్ లేదని, తమకు కంటెంట్ ఉందన్నారు.






