స్తంభించిన జనజీవనం.. తిరిగి సిరిసిల్ల బయలుదేరిన కేటీఆర్

by Gantepaka Srikanth |

సిరిసిల్ల(Sirisilla)లో వరద ప్రాంతాలను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కామారెడ్డి(Kamareddy) వెళ్లేందుకు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డికి చేరుకున్నారు.

స్తంభించిన జనజీవనం.. తిరిగి సిరిసిల్ల బయలుదేరిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: సిరిసిల్ల(Sirisilla)లో వరద ప్రాంతాలను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కామారెడ్డి(Kamareddy) వెళ్లేందుకు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డికి చేరుకున్నారు. సిరిసిల్ల నర్మాల పర్యటన ముగించుకుని కేటీఆర్ మాచారెడ్డి మండలానికి వెళ్లారు. అక్కడ ఆయన పాల్వంచ వాగు ఉధృతిని, తెగిన రోడ్డును పరిశీలించారు. రోడ్డు తెగిపోవడం, వరద ఉధృతి వలన కామారెడ్డి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో, పాల్వంచ నుంచి కేటీఆర్ తిరిగి సిరిసిల్ల బయలుదేరారు. పాల్వంచ వాగు వరదల వల్ల జనజీవనానికి ఏర్పడిన ఆటంకాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Next Story