KTR: సుప్రీం ఆదేశాలతో సర్కార్‌కు దిమ్మతిరిగిందా.. కేటీఆర్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

కంచె గ‌చ్చిబౌలి (Kanche Gachibowli) పరిధిలోని మొత్తం 400 ఎక‌రాల భూ వ్యవహారంలో గురువారం సుప్రీం కోర్టు (Supreme Court) సీరియస్ అయింది.

KTR: సుప్రీం ఆదేశాలతో సర్కార్‌కు దిమ్మతిరిగిందా.. కేటీఆర్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కంచె గ‌చ్చిబౌలి (Kanche Gachibowli) పరిధిలోని మొత్తం 400 ఎక‌రాల భూ వ్యవహారంలో గురువారం సుప్రీం కోర్టు (Supreme Court) సీరియస్ అయింది. తదుపరి ఉత్తర్వులు (Further orders) వచ్చే వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి (CS Shanti Kumari)కి ఆదేశించింది. మరోవైపు హెచ్‌సీయూలో విద్యార్థులు ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కంచ గచ్చబౌలి భూముల వ్యవహారంపై ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. అందులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రలు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అయితే, వారు హెచ్‌సీయూ యాజమాన్యం, విద్యార్థులు, ఆయా ప్రజా, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు జరుపనున్నట్లుగా తెలుస్తోంది. ఇక అదే భూమిలో ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న 400 ఎకరాల్లోనే కాకుండా యూనివర్సిటీ భూములు 1,600 ఎకరాలను కలిపి 2 వేల ఎకరాల్లో అతి పెద్ద ఎకో పార్క్‌ (Eco Park)గా రూపొందించాలని సర్కార్ డిసైడ్ అయినట్లుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కాంగ్రెస్ సర్కార్‌పై ‘X’ వేదికగా మాటలతో విరుచుకుపడ్డారు. కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli)లోని 400 ఎకరాల భూమిని గ్రీన్ జోన్‌గా ప్రకటించి నగరంలోనే బెస్ట్ ఎకో పార్క్‌ (Eco Park)గా తయారు హెచ్‌సీయూ (HCU)కి కానుకగా ఇస్తామని ప్రకటించిన వెంటనే.. 24 గంటలు తిరగక ముందే 2 వేల ఎకరాల్లో ఎకో పార్క్ అంటూ కాంగ్రెస్ సర్కారు (Congress Government) బీరాలు పలుకుతోందని అన్నారు. సుప్రీం ఆదేశాలతో సర్కారుకు దిమ్మతిరిగిందని.. ఎకో పార్క్ నిర్మాణం అంటే ఏఐ వీడియో తయారు చేసినంత ఈజీ కాదన్నారు. ఇక నైట్ సఫారీ అంటే.. రాత్రికి రాత్రే వందల జేసీబీలు, టిప్పర్లతో చొరబడి విధ్వంసం చేయడం కాదని సెటైర్లు వేశారు.

నాలుగు రోజుల్లో వందల ఎకరాల అడవిని నాశనం చేసి.. ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీలు ఝళిపించి, కేసులు పెట్టి జైళ్ల పాలు చేశారని మండిపడ్డారు. మూగ జీవుల ఆర్తనాదాలు, అర్ధరాత్రి దండయాత్రను కెమెరాలతో చిత్రీకరించారని కేసులు పెట్టి, ఏఐ వీడియోలు అంటూ దుష్ప్రచారం చేశఆరని ఫైర్ అయ్యారు. పెయిడ్ ఉద్యమకారులు అని గోబెల్స్ ప్రచారం చేసి.. చివరకు సోషల్ మీడియా (Social Media) ఇన్‌ఫ్లుయెన్సర్లతో వీడియోలు చేయించి అభాసుపాలైంది అనైతిక కాంగ్రెస్ సర్కార్ అంటూ మండిపడ్డారు. ఇది ఇది సర్కారు కాదు.. సర్కస్ కంపెనీ అంటూ ఫైర్ అయ్యారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజల ఆకాంక్షల హేళన.. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story