- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌కు చేదు అనుభవం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాగా సొంత నియోజకవర్గంలోనే ఆయనకు ప్రజలు షాక్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాగా సొంత నియోజకవర్గంలోనే ఆయనకు ప్రజలు షాక్ ఇచ్చారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూరు బాబాజీ కాలనీ 09 వార్డులో కేటీఆర్‌ను కాలనీవాసులు నిలదీశారు. గతంలో ఎలాంటి పనులు కాలేదని, బీఆర్ఎస్ కౌన్సిలర్ పనులు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ కోసం తమ భూములు లాక్కుని ఇంత వరకు ఎవరూ న్యాయం చేయడం లేదని ఆవేదన చెందారు. ఓ మహిళ తనకు ఐదుగురు సంతానం అని తన భర్త హార్ట్ ఎటాక్ తో మరణించాడని చెప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ భూమి పోయిందని ఇప్పటి వరకు తమకు ఎలాంటి పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగినా పని జరగటంలేదని చెప్పింది. దీంతో కేటీఆర్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.






