MLC Kavitha Letter: కవిత లేఖపై కేటీఆర్, హరీశ్‌రావు సైలెంట్! మాట్లాడేందుకు నిరాకరించిన నాయకులు

by Ramesh Naini |   (  Updated:2025-05-23 08:18:34  IST  )

బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసినట్లు రాజకీయ దుమారం రేపుతోంది.

MLC Kavitha Letter: కవిత లేఖపై కేటీఆర్, హరీశ్‌రావు సైలెంట్! మాట్లాడేందుకు నిరాకరించిన నాయకులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారిన ఎమ్మెల్సీ కవిత లేఖపై సస్పెన్స్ కొనసాగుతోంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూతురు కవిత రాసిన ఉత్తరం నెట్టింట్లో వైరల్ కావడంతో దానిపైనే తీవ్ర చర్చ జరుగుతుంది. అయినా ఆ లెటర్‌పై కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఎలాంటి రిప్లై రావడం లేదు. ఈ లేఖపై ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కానీ, ఈ లెటర్‌పై కేటీఆర్, హరీశ్‌రావు, కవిత సైలెంట్ ఉన్నారు.

ఈ ఇష్యూపై ఇవాళ (శుక్రవారం) కేటీఆర్, హరీశ్‌‌లను విలేఖరులు ప్రశ్నించగా మాట్లాడేందుకు వారు నిరాకరించారు. ఓ ఫ్రోగ్రామ్‌కు అటెండైన కేటీఆర్‌ను ఓ జర్నలిస్ట్ తన చెల్లెలు లేఖపై అడుగగా త్వరలో స్పందిస్తానని దాటవేస్తూ.. మాకు లేని హడావుడి మీకెందుకంటూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అలాగే మీడియా ప్రతినిధి మాజీ మంత్రి హరీశ్‌ను కూడా కవిత లెటర్‌ గురించి అడుగగా అందుకు ఆయన మాట్లాడకుండానే హడావుడిగా కారు ఎక్కి వెళ్లిపోయారు. ఇక కూతురు తనకు వ్యతిరేకంగా రాసిన లేఖ తెలంగాణ అంతటా ఊరేగుతున్న పెద్దమనిషి కేసీఆర్ కూడా స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది.

కాగా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాసినట్లు లెటర్ చక్కర్లు కొడుతోంది. వరంగల్ రజతోత్సవ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందని, 2001 నుంచి మన పార్టీలో ఉన్న వారు ప్రసంగిస్తే బాగుండేదని లేఖలో పేర్కొన్నారు. ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలం అయ్యామని, బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలామంది ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నేను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను డాడీ.. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ.. అంటూ తెలిపారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని, ఈ పొలిటికల్ సినారియో అడ్రస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఇస్తారని అంతా భావించారని, ఇప్పటికైనా 1, 2 ప్లీనరీ పెట్టాలని లేఖలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

Next Story