నందినగర్‌లో కేటీఆర్, హరీశ్‌రావు కీలక భేటీ.. హంగ్ స్థానాల్లో పాగా వేసేందుకు ప్లాన్

by Kema Shiva Kumar |

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నందినగర్‌లో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ అయ్యారు. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో మేయర్, ఛైర్మన్ పీఠాలను దక్కించుకోవడమే లక్ష్యంగా, ఎక్స్‌అఫీషియో ఓట్ల వినియోగం, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుపై వారు వ్యూహ రచన చేస్తున్నారు.

నందినగర్‌లో కేటీఆర్, హరీశ్‌రావు కీలక భేటీ.. హంగ్ స్థానాల్లో పాగా వేసేందుకు ప్లాన్
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ నగరంలోని నందినగర్‌ కేసీఆర్ (KCR) నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అత్యవసరంగా భేటీ అయ్యారు. హంగ్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారిద్దరూ కసరత్తు చేస్తున్నారు. అక్కడ ఎలాగైనా గులాబీ జెండా ఎగురవేయాలని వారు పట్టుదలగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిన చోట వారి మద్దతు కూడగట్టడంపై స్థానిక బీఆర్ఎస్ నేతలను సమాయత్తం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ పీఠాలను దక్కించుకోవడానికి ఎక్స్‌అఫీషియో ఓట్లను అస్త్రంగా వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ సమావేశం అనంతరం గెలిచిన కౌన్సిలర్లు చేజారిపోకుండా జాగ్రత్త పడాలని.. స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని పార్టీ ఇంచార్జ్‌లకు వారు దిశానిర్దేశం చేశారు.

Next Story