- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామేశ్వరం కేఫ్ వేదికగా రాజకీయ ముచ్చట్లు..! కేటీఆర్‌తో అఖిలేశ్ యాదవ్ టిఫిన్
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ‘రామేశ్వరం కేఫ్’లో కలిసి టిఫిన్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ (శనివారం) హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ‘రామేశ్వరం కేఫ్’లో కలిసి టిఫిన్ చేశారు. నగరంలో ఎంతో ఆదరణ పొందిన రామేశ్వరం కేఫ్ రుచుల గురించి, అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి తెలుసుకున్న అఖిలేశ్ యాదవ్ ఆసక్తి కనబరచడంతో, కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు దక్షిణాది రుచులను ఆస్వాదిస్తూనే.. పలు రాజకీయ, సమకాలీన అంశాలపై కాసేపు ముచ్చటించారు.
ఇక, వీరి రాక సందర్భంగా రామేశ్వరం కేఫ్ యజమాని శరత్ ఇరువురు నేతలకు ఘన స్వాగతం పలికి తగిన ఏర్పాట్లు చేశారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేశ్ యాదవ్.. వాటి నాణ్యతను, రుచిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. హైదరాబాద్‌లోనూ రామేశ్వరం కేఫ్‌ను ఇంత విజయవంతంగా నడుపుతుండటం పట్ల యజమాని శరత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు అఖిలేశ్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. రామేశ్వరం కేఫ్‌లో లంచ్ కార్యక్రమం ముగిసిన అనంతరం, అఖిలేశ్ యాదవ్, కేటీఆర్ అక్కడి నుండి బయలుదేరి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు.






