- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : కేటీఆర్ కు అరుదైన గౌరవం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. అమెరికా(America)లోని ఇల్లినాయిస్(Illinois)లో ప్రతిష్ఠాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ(North Western University) నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఏప్రిల్ 19న జరిగే ఐబీసీ 2025(IBC 2025) సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాలని విజ్ఞప్తి చేసింది. గత ప్రభుత్వంలో కేటీఆర్ తెలంగాణ(Telangana)కు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేసినపుడు దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో పదేళ్లలో చేసిన కృషి అద్భుతమని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఈ సందర్భంగా కొనియాడింది. హైదరాబాద్(Hyderabad)ను యువతకు ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దారని ప్రశంసించింది. తెలంగాణ పదేళ్ల పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం స్ఫూర్తిదాయకమని అభినందనలు తెలిపింది.






