- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: మనం సర్వనాశనం అయిపోతున్నాం.. కానీ మనబాధను వినేవారెవరూ లేరని ఓ ఆటోడ్రైవర్ తనతో చెప్పిన మాటల్ని రాహుల్ గాంధీ ఎక్స్ లో పేర్కొన్నారు. సీఎన్జీ (CNG) నుండి ఎల్పీజీ (LPG) గ్యాస్ వరకు, పిల్లల చదువుల నుండి వైద్యం వరకు, పాల నుండి వంట నూనెల వరకు ప్రతి వస్తువుపై పెరుగుతున్న ఒక్కో రూపాయి పేదల బడ్జెట్‌ను, వారి వంటగదిని నేరుగా దెబ్బతీస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ పోస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. రాహుల్ గాంధీ ఢిల్లీలో నాటకాలు వేస్తున్నారని ఆరోపించారు. గత 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.
"ఢిల్లీలో కొత్తగా పెద్ద పెద్ద వాగ్దానాలు చేసే ముందు.. గత 2023లో తెలంగాణ ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో దయచేసి కాస్త వివరిస్తారా? నాడు ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, అలాగే ప్రతి డ్రైవర్‌కు ఏటా రూ.12,000 ఆర్థిక సహాయం అందిస్తామని మీరు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచిపోయినా.. ఇప్పటివరకు వాటిలో ఒక్కటంటే ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు ఆర్థిక ఇబ్బందులు తాళలేక దాదాపు 100 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్ల క్రితం తెలంగాణ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలే ఇంకా పెండింగ్‌లో పెట్టుకుని.. ఇప్పుడు మళ్లీ ఢిల్లీలో ఈ కొత్త రాజకీయ నాటకాలు దేనికి?" అంటూ కేటీఆర్ నిలదీశారు.






