BRSV కార్యకర్తపై చేయి చేసుకున్న కేటీఆర్.. వీడియో వైరల్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-26 15:33:31  IST  )

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ విద్యార్థి విభాగం కార్యకర్తపై చేయి చేసుకున్నారు. నేడు ఉప్పల్‌లో రాష్ట్రస్థాయి తెలంగాణ విద్యార్థి విభాగం సదస్స నిర్వహించారు.

BRSV కార్యకర్తపై చేయి చేసుకున్న కేటీఆర్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ విద్యార్థి విభాగం కార్యకర్తపై చేయి చేసుకున్నారు. నేడు ఉప్పల్‌లో రాష్ట్రస్థాయి తెలంగాణ విద్యార్థి విభాగం సదస్స నిర్వహించారు. కార్యక్రమంలో కౌశిక్ రెడ్డితో కలిసి కేటీఆర్ నడుస్తున్న సమయంలో ఓ కార్యకర్త వచ్చి ఆయన ముందు నిలుచుకున్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందో కానీ కేటీఆర్ అసహనంతో ఊగిపోయారు.

వెంటనే అతని తలపై చేయిపెట్టి పక్కకి తోసేశారు. పక్కనే బాడీగార్డ్ సైతం అతడిని రెండు దెబ్బలు వేశాడు. అనంతరం కౌశిక్ రెడ్డి మరియు కార్యకర్తలు అతడిని పక్కకి నెట్టేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కేటీఆర్ తీరుపై మండిపడుతున్నారు. సొంతపార్టీ కార్యకర్తనే తోసేయడంపై విమర్శలు కురిపిస్తున్నారు.

Next Story