ఇది రేవంత్ ప్రభుత్వ పిరికిపంద చర్య.. బాల్క సుమన్ అరెస్ట్ పై కేటీఆర్ ఆగ్రహం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-18 12:55:56  IST  )

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టును బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. క్యాతనపల్లిలో మంత్రి వివేక్ నేరుగా ఎన్నికల ప్రక్రియను శాసిస్తూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడని కేటీఆర్ అన్నారు. బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇది రేవంత్ ప్రభుత్వ పిరికిపంద చర్య.. బాల్క సుమన్ అరెస్ట్ పై కేటీఆర్ ఆగ్రహం
X

దిశ‌, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టును బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. క్యాతనపల్లిలో మంత్రి వివేక్ నేరుగా ఎన్నికల ప్రక్రియను శాసిస్తూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడని కేటీఆర్ అన్నారు. బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక దళిత నాయకుడిని, ముందస్తు నోటీసులు లేకుండా బందిపోట్ల మాదిరిగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనం అంటూ మండిప‌డ్డారు.

పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయిందని విమ‌ర్శించారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు కాంగ్రెస్ నాయకుల కళ్లసైగలకు తలొగ్గి పని చేస్తున్నారని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. బాల్క సుమన్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలను, కార్యకర్తలను పోలీసులు వేధించడం ఆపాలని కేటీఆర్ అన్నారు. లేదంటే ఇప్పుడు అధికార పార్టీకి, మంత్రికి అడుగులకు మడుగులోత్తుతూ, అక్రమాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారి భవిష్యత్తులో తగిన ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

కాంగ్రెస్ మార్క్‌ గూండాగిరి రాజ్యమేలుతోంది.. మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం

Next Story