420 మందిని బలి తీసుకున్న 420 హామీల పాపం.. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్

by Ramesh Goud |

తెలంగాణ (Telangana)లో రైతుల ఆత్మహత్యలపై (Farmers Suicides) మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ (BRS Working President KTR) సంచలన వ్యాఖ్యలు (sensational comments) చేశారు.

420 మందిని బలి తీసుకున్న 420 హామీల పాపం.. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana)లో రైతుల ఆత్మహత్యలపై (Farmers Suicides) మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ (BRS Working President KTR) సంచలన వ్యాఖ్యలు (sensational comments) చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government)పై ఫైర్ అయ్యారు. తెలంగాణ పల్లెల్లో (villages) మరణమృదంగం (death knell) మోగుతుందని (Ringing) ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల (local body elections)కు సమయం దగ్గర పడుతున్న వేళ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ పథకాలలోని (government's schemes) లోపాలను ఎత్తిచూపుతూ.. విమర్శల వర్శం కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్.. “420” అబద్ధపు హామీల పాపం.. “420” రోజుల చేతకాని పాలన శాపం అని, ఫలితంగా మాటలకందని మహావిషాదం అని వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ చెల్లించిన భారీ మూల్యం, 420 మంది రైతన్నల బలవన్మరణం అని ఆరోపించారు. అంతేగాక అసమర్థులు అధికారం పీఠమెక్కి.. అన్నదాతలను బలిపీఠం ఎక్కిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇక కన్నీటి సేద్యం చేయలేక, భూములున్న కర్షకులే కాదు.. కౌలు రైతులూ పిట్టల్లా రాలిపోతున్నారని అన్నారు. దేశానికే వెన్నుముకైన రైతులకు, కుటిల కాంగ్రెస్ పాలనలో వరుస వెన్నుపోట్లు అంటూ.. ఓట్లనాడిచ్చిన హామీలకు లెక్కలేనన్ని తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టారు.

పదేళ్ల (ten years)లో పంజాబ్ (Punjab)నే తలదన్నే స్థాయికి తెలంగాణ అని, నేడు పెట్టుబడికి పత్తాలేదు.. దిగుబడికి దిక్కులేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ (loan waivers)ని ఆగంచేసి, పెట్టుబడి సాయానికి పాతరేసి, ముంచేరోజులు తేవడంవల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని తెలిపారు. చలనం లేని సీఎం (CM), బాధ్యత లేని సర్కారు (Goevrnment) వల్లే, మళ్లీ తెలంగాణ పల్లె కన్నీరుపెడుతోందని, మళ్లీ మరణమృదంగం మోగుతోందని చెప్పారు. చేతనైతే.. ఇకనైనా సాగు సంక్షోభాన్ని తీర్చండి.. అన్నదాతల ఆత్మహత్యల పరంపరను ఆపండి అంటూ.. జై కిసాన్ (Jai Kisan), జై తెలంగాణ (Jai Telangana) అని బీఆర్ఎస్ నేత (BRS Leader) రాసుకొచ్చారు.

Next Story