- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: రైతు సమస్యలు ఇక్కడ ఉంటే సీఎం, మంత్రులు బీహార్‌లో! కేటీఆర్ ఫైర్
రైతన్నలు ఇక్కడ రాష్ట్ర సీఎం, మంత్రులు ఎక్కడ ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ప్రశ్నించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రైతన్నలు ఇక్కడ రాష్ట్ర సీఎం, మంత్రులు ఎక్కడ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. సమస్యలు ఇక్కడ ఉంటే సీఎం, మంత్రులు ఢిల్లీ, బీహార్లోనా అంటూ ప్రశ్నించారు. బీహార్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆధ్వర్యంలో జరుగుతున్న ఓట్ అధికార్ యాత్రలో తెలంగాణ నాయకులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. (Farmers) రైతులు (Urea) యూరియా కోసం తండ్లాతుంటే.. మీరు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి ఎగిరిపోతారా అని ఫైర్ అయ్యారు. జాతీయ పార్టీలకు ఓట్లు, రాష్ట్ర ప్రజలకు పాట్లు.. అని పేర్కొన్నారు. యూరియా ఏదయా అంటే..? కాంగ్రెస్ ఎంపీలు తేలేరు.. బీజేపీ ఎంపీలు అడగనే అడగరు.. అని విమర్శించారు. వీటిని తెలంగాణ గమనిస్తున్నది.. తెలంగాణ ప్రశ్నిస్తున్నదని తెలిపారు. యూరియా కోసం లైన్‌లో నిలబడిన ఫోటోలను కేటీఆర్ ట్వీట్‌లో పోస్ట్ చేశారు.
కాగా, బీహార్‌లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓట్ అధికార్ యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పాల్గొని రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకాటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






