IAS ల లెక్కలన్నీ సరిచేస్తాం : కేటీఆర్

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS) అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు.

IAS ల లెక్కలన్నీ సరిచేస్తాం : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS) అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ లో రేషన్ కార్డుల(Ration cards) పంపిణీ కార్యక్రమంలో ఐఏఎస్ హరిచందన దాసరి, ఐపీఎస్ డీఎస్ చౌహాన్‌లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేశారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో 2016-2023 మధ్య 6,47,479 రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్ కు అనుకూలంగా వారు మాట్లాడినట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేడు పరిగి నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, వారు సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. మరో రెండేళ్లలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఇలాంటి అధికారుల లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్లు తీవ్రంగా స్పందించాయి. కేటీఆర్ వ్యాఖ్యలు అధికారుల సమగ్రతను ప్రశ్నించేలా ఉన్నాయని, ఇవి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఖండించాయి. కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

Next Story